కంకర రోడ్డు ఆలస్యానికి యువకుల నిరసన

కంకర రోడ్డు ఆలస్యానికి యువకుల నిరసన

HNK: ఐనవోలు మండలం కొండపర్తి గ్రామంలో కంకర రోడ్డు నిర్మాణం ఆలస్యం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన యువకులు ఇవాళ రహదారికి అడ్డంగా ముళ్లకంప చెట్లు ఉంచి వాహనాలను ఆపేశారు. అధికారుల దృష్టికి ఫిర్యాదు చేసినా పరిష్కారం లేకపోవడంతో నిరసనకు దిగారు. గ్రామీణ రహదారి పనులు ఆలస్యం కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.