ప్రతీ గ్రామంలో మోడల్ ప్రదర్శనలు చేపట్టాలి: జేసీ
GNTR: జాతీయస్థాయి ప్రకృతి వ్యవసాయ మిషన్ అదనంగా గుంటూరు జిల్లాలోని 77 గ్రామాలకు విస్తరిస్తుందని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం వార్షిక కార్యాచరణ ప్రణాళికపై జేసీ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ప్రచార దశలో ప్రతీ గ్రామంలో సమావేశాలు, మోడల్ ప్రదర్శనలు చేపట్టాలని చెప్పారు. ఈ సమావేశంలో ప్రాజెక్టు మేనేజర్ రాజకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.