VIDEO: తాగునీరు సౌకర్యం లేక నీకు ఇబ్బందులు..
ASR:పెదబయలు మండలం గోమంగి పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. సరియాపల్లి, సంతబయలు, కుమ్మరి వీధి గ్రామాల్లో గత ఐదు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం గ్రామస్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరుతున్నారు.