మాజీ ముఖ్యమంత్రిని కలిసిన యనమల భాస్కరరావు

కడప: ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట ఉమ్మడి బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని రైల్వే కోడూరు జనసేన అభ్యర్థి డాక్టర్ యనమల భాస్కర్ శనివారం కనిగిరిలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. నియోజకవర్గంలోని రాజకీయ విషయాలపై చర్చించారు. తన విజయానికి సహకారం అందించాలని యనమల కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు.