ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఫ్లైఓవర్‌పై కారు బోల్తా.. ఇద్దరికి తీవ్ర గాయాలు

HNK: కాజీపేట పట్టణంలోని ఫాతిమా నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జిపై గురువారం తెల్లవారుజామున కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.