మెగా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన మంత్రి
VZM: చిన్న, మద్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇవాళ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో మెగా ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. నేటి నుండి ఈనెల 16 వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. విజయనగరంలో అన్ని రకాల ప్రాడక్ట్ ఇక్కడ లభ్యం కావడం అభినందించ దగ్గ విషయమని మంత్రి అభినందించారు.