ఎరువుల దుకాణాలను పరిశీలించిన ఏఎస్పీ

NDL: పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను, గోడౌన్లను నంద్యాల ఏఎస్పీ జావలి తమ సిబ్బందితో వ్యవసాయ అధికారులు ఏవో ప్రసాదరావుతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. దుకాణదారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఎరువుల నిల్వలు ఉంచుకొని రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని నిరూపితమైతే శాఖా పరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.