గోవిందరాజుల స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం సనుగుల గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజుల స్వామి వారిని శుక్రవారం ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్‌కు ఘనస్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన, అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.