ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
BHNG: ఆలేరు మండలం గోలనుకొండ, కొల్లూరు, మందనపల్లి గ్రామాల్లో అలాగే ఆలేరు పట్టణంలోని మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని సరైన ధరకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని పేర్కొన్నారు.