పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్
PDPL: రెండవ విడత పోలింగ్ జరగనున్న జూలపల్లి మండల ఎంపీడీవో కార్యాలయాలను జిల్లా కలెక్టర్ శ్రీహర్ష సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేలా చూడాలన్నారు.