'పులివెందులలో మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి'

'పులివెందులలో మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలి'

KDP: వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజించాలని మున్సిపల్ కమిషనర్ రాముడు ప్రజలకు సూచించారు. శుక్రవారం పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వినాయక విగ్రహాల తయారీ, వినాయక విగ్రహాల నిమజ్జనాలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసే విగ్రహాలను ప్రభుత్వం నిషేధించిందన్నారు.