విద్యార్థులకు భగవద్గీత పోటీలు

విద్యార్థులకు భగవద్గీత పోటీలు

VZM: విజయనగరం స్థానిక టీడీపీ కళ్యాణ మండపంలో ఆదివారం భగవద్గీత పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 40 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు ప్రోగ్రాం అసిస్టెంట్ జె.శ్యాంసుందరం తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయ నిర్ణీతులుగా కె.శ్రీనివాసచార్యులు, శ్రీనివాసరాజు పాల్గొని ప్రశంస పత్రాలు అందజేశారు. విజేతలకు నగదు బహుమతి డిసెంబర్ 1న ప్రదానం చేయనున్నారు.