'విశాఖకు మొదటి స్థానం లక్ష్యం'
VSP: స్వచ్ఛ సర్వేక్షన్ 2025-26లో విశాఖను దేశంలోనే మొదటి పరిశుభ్ర నగరంగా నిలపాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులకు సూచించారు. గురువారం వీఎంఆర్డిఏ చిల్డ్రన్ థియేటర్‌లో అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. డోర్ టు డోర్ వ్యర్థాల సేకరణ, వ్యర్థాల విభజన, పౌర అవగాహన, పబ్లిక్ టాయిలెట్స్, గ్రీన్ బెల్ట్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.