రామలింగేశ్వర స్వామి ఆలయంలో మొదలైన మార్పులు
NLG: తెలంగాణలో ప్రసిద్ధమైన దేవాలయమైన నల్లగొండ మండలంలోని చెర్వుగట్టు రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మార్పులు మొదలయ్యాయి. ప్రతి గురువారం 'మన గుడి.. స్వచ్ఛత పరిశుభ్రత' కార్యక్రమానికి ఆలయ ఈవో మోహన్ బాబు శ్రీకారం చుట్టారు. ఆలయంలో చెత్త ఇకనుంచి ఎక్కడపడితే అక్కడ వేయకుండా ఈవో దృష్టి సారించారు. ఈ సందర్భంగా బుధవారం చెత్త కోసం బుట్టలను ఏర్పాటు చేశారు.