విధులకు గైర్హాజరైన సిబ్బందిపై చర్యలు
PDPL: కమాన్ పూర్ మండలంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు గైర్హాజరైన 25 మంది సిబ్బందిపై జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో 11 మంది పోలింగ్ ఆఫీసర్లు, 14 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు ఉన్నారు. అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగమని, వివరణ ఇవ్వకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.