పుంగనూరులో ఈనెల 22న హనుమాన్ జయంతి

CTR: పుంగనూరు మండలంలోని తోపు మఠం బాలగురవయ్యగారిపల్లి రోడ్డులో వెలిసిన వీరాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు గురువారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం అభిషేకాలు, పూజలు, రాత్రి 10:30 గంటలకు సీతారాముల కళ్యాణం జరుగుతుందన్నారు. భక్తులకు ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులు పాల్గొనాలని కోరారు.