అవ్వా ఓటు విలువ తెలుసుకో.. అమ్ముకోకు: మఠంపల్లి ఎస్సై
SPRT: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మఠంపల్లి మండలంలో విధుల్లో ఉన్న ఎస్సై బాబు ఒక వృద్ధురాలితో సరదాగా ముచ్చటించారు. ఆమెకు ఓటు హక్కుపై అవగాహన పెంచే ప్రయత్నం చేశారు."అవ్వా! నీ ఓటు అమ్ముకోకు. నీ ఓటు విలువ తెలుసుకో. నువ్వు వేసే ఓటు నీకు, నీ భావితరాల వారికి ఉపయోగపడేలా, అభివృద్ధి చేసే వ్యక్తికే ఓటు వేసి దాని విలువను పెంచు" అని ఎస్సై బాబు ఆమెతో అన్నారు.