విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ

కోనసీమ: అయినవిల్లి మండలం నేదునూరులో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులకు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పుల్లేటికుర్రుకు చెందిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ కే.ఆనందరావు బుధవారం రూ.12,000 విలువ చేసే ఏకరూప దుస్తులను అందజేశారు. విద్యా కమిటీ ఛైర్మన్ పసుపులేటి వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్ఎం ప్రసాదరావు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.