'ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి'
VZM: ధాన్యం సేకరణ ప్రక్రియను పకడ్బంధీగా నిర్వహించాలని, ట్రక్ షీట్లను వేగంగా జారీ చేసి రైతులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేధు మాధవన్ ఆదేశించారు. బుధవారం దత్తిరాజేరు మండలం పెదమానాపురం గ్రామంలో ఉన్న రైతు సేవ కేంద్రాన్ని సందర్శించారు. సిబ్బంది నిర్వహిస్తున్న కొనుగోలు ప్రక్రియను, తేమ కొలిచే విధానాన్ని పరిశీలించారు.