పొదలకూరు సర్పంచ్ చెక్ పవర్ రద్దు

పొదలకూరు సర్పంచ్ చెక్ పవర్ రద్దు

NLR: పొదలకూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ మల్లిక చిట్టెమ్మ చెక్ పవర్‌ను డీపీవో శ్రీధర్ రెడ్డి సోమవారం రద్దు చేశారు. పంచాయతీ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి, టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా, డీఎల్ పీవో విచారణలో నిధుల దుర్వినియోగం రుజువైనట్లు తెలిపారు.