VIDEO: దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు

PLD: నూజెండ్లలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని ఐనవోలులో ఆరుబయట నిద్రిస్తున్న దంపతులపై బుధవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. మంటల్లో తీవ్ర గాయాలపాలైన దంపతులను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.