VIDEO: సిరిపురంలో రైతుల ఆందోళన

VIDEO: సిరిపురంలో రైతుల ఆందోళన

BHNG: రామన్నపేట మండలం సిరిపురంలో సోమవారం రైతులు, గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. గ్రామ శివారులో నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న కంకర క్రషర్ మిల్లు పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రషర్ వల్ల పంట పొలాలు దెబ్బతినడమే కాకుండా పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.