గండిచెరువు గ్రామ పంచాయతీ ఎన్నికలో రసవత్తర పోరు

గండిచెరువు గ్రామ పంచాయతీ ఎన్నికలో రసవత్తర పోరు

RR: గండిచెరువు గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. మొత్తం 8 వార్డులకు పదుల సంఖ్యలో ఆశావహులు పోటీ పడ్డారు. 8వ వార్డు నుంచి నామినేషన్ వేసిన నామాల హరిబాబు, తన గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. గతంలో స్వల్ప తేడాతో ఓడిన ఆయన, వార్డు ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పనే తన ప్రథమ సంకల్పం అని స్పష్టం చేశారు.