VIDEO: తడ్కల్‌లో రైతు భరోసా వీడియో కాన్ఫరెన్స్
SRD: కంగ్టి మండలం తడ్కల్ రైతు వేదికలో ప్రజా పాలన రైతు ఉత్సవ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి రైతు భరోసా నిధులను విడుదల చేయడం జరిగిందని సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి అన్నారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు హన్మండ్లు, భార్గవ్ చారి, రైతులు ఉన్నారు.