టీడీపీ, వైసీపీ ఘర్షణ.. జడ్పీటీసీకి గాయాలు
NDL: ఉయ్యాలవాడలో CC రోడ్డు నిర్మాణ విషయంలో శనివారం TDP, YCP నేతలు ఘర్షణ పడ్డారు. TDPకి చెందిన రమేశ్ రెడ్డి రోడ్డు నిర్మాణానికి పూనుకున్నారు. రోడ్డు నిర్మించే స్థలం తమదని, పట్టా ఉందని YCP ZPTC లక్ష్మీదేవి అడ్డుకుంది. ఇది తమకు చెందినదంటూ రమేశ్ రెడ్డి పనులు ప్రారంభించారు. దీంతో ఇరువర్గాల ఘర్షణలో లక్ష్మీదేవి తలకు గాయమైంది. ఆమెను ఆళ్లగడ్డ ఆస్పత్రికి తరలించారు.