'అబుల్ కలాం సేవలు మరువలేనివి'
MBNR: స్వాతంత్య్ర సమరయోధుడిగా, కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు ఎప్పటికీ మరువలేమని మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన జయంతిని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలాం చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులర్పించి, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మర్రిజనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.