12న నవోదయ మోడల్ పరీక్ష

ASR: ఈనెల 12న పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నవోదయ పరీక్షలను అరకులోయ గవర్నమెంట్ హైస్కూల్లో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి జి గెన్ను, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గోపీనాథు తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఉంటుందని నవోదయ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఈ మోడల్ పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.