సర్పంచ్‌గా మామపై కోడలు విజయం

సర్పంచ్‌గా మామపై కోడలు విజయం

JGL: రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా రాయికల్ మండలం శ్రీరాంనగర్ లో మామపై కోడలు విజయం సాధించింది. మామ సత్యనారాయణ (కాంగ్రెస్)పై కోడలు రాధిక(BJP) 14 ఓట్ల తేడాతో గెలుపొందింది. ఈ గెలుపు పట్ల గ్రామ బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.