VIDEO: నాగుల చవితి సందర్భంగా ప్రత్యేక పూజలు

NDL: రుద్రవరం మండలంలో గురువారం నాడు నాగుల చవితి పండుగను పలు ఆలయాలలో ఘనంగా నిర్వహించారు. పండుగ పురస్కరించుకుని భక్తులు భక్తి శ్రద్ధలతో దేవాలయాలకు వెళ్లి నోములు నోచుకుని పూజలు నిర్వహించి, మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల్లో భక్తులకు అర్చన, మంగళహారతి, ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు.