స్వచ్ఛ కాకినాడకు ప్రజలంతా సహకరించండి: కమిషనర్
కాకినాడ నగర అభివృద్ధికి, పారిశుద్ధ్య నిర్వహణకు ప్రజల సహకారం అవసరమని కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. ఇవాళ ఆయన డైరీ ఫార్మ్ ప్రాంతంలో శానిటేషన్ అమలును పరిశీలించారు. రోడ్డుపై చెత్త వేసే చిరు వ్యాపారులకు పెనాల్టీ విధిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఆఫీసర్, తదితరులు పాల్గొన్నారు.