శతాధిక వృద్ధుడు రాములు కన్నుమూత
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో శతాధిక వృద్ధుడు ఆదోండ రాములు బుధవారం తుదిశ్వాస విడిచారు. నలుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు, మనవలు, మనవరాళ్లతో ఆయన కుటుంబం ఎంతో పెద్దది. నిండు నూరేళ్లు కుటుంబ సభ్యుల మధ్య సంతోషంగా గడిపిన రాములు వయోభారంతో కన్నుమూయడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆయన మరణం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది.