ఉపాధి హామీ పనులను పరిశీలించిన నాయకులు

HNK: ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామ శివారులో సాగుతున్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పనులను ఇవాళ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సందర్శించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మునిగాల బిక్షపతి, కర్రే లక్ష్మణులు పనులు జరుగుతున్న తీరును కూలీలతో మాట్లాడి తెలుసుకున్నారు. వేసవికాలం కావడంతో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.