యారాడ మార్గంలో వాహన తనిఖీలు

యారాడ మార్గంలో వాహన తనిఖీలు

VSP: మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని యారాడ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఆదివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. బీచ్ పరిసరాల్లో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి వల్ల ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు చేపట్టారు. క్రైమ్ విభాగం ఎస్సై ఎం. వి రమణ పర్యవేక్షణలో పోలీసులు ఈ తనిఖీలు చేశారు.