కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
SRCL: కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో ప్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందని, ప్రతి రైతు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని అన్నారు.