కె.వి పల్లిలో బీహార్ వాసి ఆత్మహత్య

కె.వి పల్లిలో బీహార్ వాసి ఆత్మహత్య

CTR: పీలేరు నియోజకవర్గం కేవీపల్లె మండలం గుండ్రేవారిపల్లెలో బిహార్ యువకుడు రామ్ కుమార్ సాహ్ని (25) ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామంలో అతను గ్రానైట్ బండల పనుల చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. సాహ్ని ఉరేసుకుని చనిపోవడాన్ని అతని తమ్ముడు గుర్తించాడు. మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రహీముల్లా తెలిపారు.