VIDEO: ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

SRPT: తుంగతుర్తిలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను రోగులను అడిగి తెలుసుకున్నారు. జనరల్ వార్డులతో పాటు ఎక్స్‌రే అన్ని రూములను కలియ తిరుగుతూ పరిశీలించారు. వారి వెంట తహశీల్దార్ దయానందం, ఎంపీడీవో శేషు కుమార్, ఆస్పత్రి సూపరింటెండెంట్ నిర్మల్ పాల్గొన్నారు.