'ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లలను చేర్పిద్దాం'
GDWL: క్యాతూర్ గ్రామంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్య, మౌలిక వసతులపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. మన పిల్లలను సర్కారు బడికే పంపి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.