VIDEO: కంగ్టి హాస్టల్లో తనిఖీ చేసిన ఎంపీడీవో
SRD: మండల కేంద్రమైన కంగ్టి ట్రైబల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలను ఎంపీడీవో సత్తయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్లో ఏమైనా సమస్యలు ఉంటే తమకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.