కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన

కుండలేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన

కోనసీమ: కాట్రేనికోన మండలం కుండలేశ్వరంలో వేంచేసి ఉన్న పార్వతీ సమేత శ్రీ కుండలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా నిమ్మకాయల జగ్గప్ప నాయుడు ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు.