ఆటో - బైక్ ఢీ.. కూలీలకు గాయాలు
PLD: కారంపూడి మండలం లక్ష్మీపురం గ్రామ శివారులో ఆదివారం ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో పలువురు గాయపడ్డారు. మిర్యాలగూడకు చెందిన కూలీలు ఆటోలో కారంపూడి వస్తుండగా, ఎదురుగా వస్తున్న బైక్ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు ఆటోలోని ఒక కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.