'రెండో విడత భూములు ఇచ్చే ప్రసక్తే లేదు'
AKP: ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు రెండో విడత భూములు ఇచ్చే ప్రసక్తే లేదని నక్కపల్లి మండలం నెల్లిపూడి రైతులు స్పష్టం చేశారు. గురువారం సీపీఎం జిల్లా నేత అప్పలరాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నెల్లిపూడిలో భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మరో కోనసీమగా పేరుగాంచిన సారవంతమైన భూములను సేకరిస్తే రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు.