కోడలి జీతం నుంచి మామకు పరిహారం: హైకోర్టు

కోడలి జీతం నుంచి మామకు పరిహారం: హైకోర్టు

రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. అజ్మేర్‌లో ఓ మహిళకు భర్త మరణంతో కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. అయితే అత్తింటి వారిని పోషించాలన్న షరతుతో ఉద్యోగం ఇచ్చారు. కానీ ఆమె వారిని పట్టించుకోకపోవడంపై అత్తింటి వారు కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారించిన కోర్టు.. కోడలి జీతం నుంచి నెల నెలా రూ.20వేలు మామకు పరిహారంగా ఇవ్వాలని ఆదేశించింది.