గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

MHBD: నెల్లికుదురులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు SI రమేష్ బాబు తెలిపారు. మంగళవారం తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఓ అనుమానాస్పద వ్యక్తి కనిపించగా అతనిని తనిఖీ చేశామన్నారు. అతడి వద్ద 1.4 కేజీల గంజాయి, 7వేల నగదు లభించిందన్నారు. SI మాట్లాడుతూ.. నిషేధిత మత్తు పదార్థాల క్రియవిక్రయాలపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు.