భీమవరంలో నకిలీ కరెన్సీ దందా గుట్టు రట్టు
W.G: భీమవరంలో నకిలీ కరెన్సీ దందా గుట్టు రట్టు అయ్యింది. శివశంకర్ అనే వ్యక్తితో రూ. 3 లక్షలకు రూ. 9 లక్షలు ఇస్తామని డీల్ కుదుర్చుకోగా, శివ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ముఠాలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, ప్రధాన నిందితుడు బర్రె సుధీర్ పరారయ్యాడు. వారి వద్దనుంచి 2.09 కోట్ల నకిలీ నోట్టు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.