అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయిన కారు

NTR: ఏ. కొండూరు మండలం గోపాలపురం శివారులో మంగళవారం ఓ కారు బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కారు అదుపు తప్పి పల్టీ కొట్టి పక్కనే ఉన్న కాలువలకు దూసుకుపోయింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణా నష్టం జరగకపోగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి సంభందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.