డిపోలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం: డీఎం
MDK: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో డిపో మేనేజర్ సురేఖ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం తాత్కాలిక డ్రైవర్ల నియామకానికి 18 నెలల హెవీ లైసెన్స్, అనుభవం కలిగిన అభ్యర్థులు గురువారం ఉదయం 5 గంటలకే డిపోలో హాజరుకావాలని ఆమె సూచించారు. సమ్మె దృష్ట్యా ప్రత్యామ్నాయ డ్రైవర్ల ద్వారా బస్సులను నుడుపుతున్నామన్నారు.