BREAKING: ఫలితాలు విడుదల
AP: రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన 54,647 దరఖాస్తుల్లో 54,016 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 30,075 మంది విద్యార్థులను మొదటి విడతలో ఎంపిక చేశారు. ఎంపికైనవారు రేపటి నుంచి ఏప్రిల్ 7లోపు సంబంధిత పాఠశాలల్లో రిపోర్ట్ చేయాలి.