ప్యాక్ చేసిన జ్యూస్ తాగుతున్నారా?

ప్యాక్ చేసిన జ్యూస్ తాగుతున్నారా?

ప్యాక్ చేసిన పండ్లరసాలు తాగితే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. ఒక లీటర్ నారింజ రసం ప్యాక్‌లో మొత్తం 135 గ్రాముల చెక్కర ఉంటుందని, ఇది 560 కిలో కేలరీలకు సమానమని చెప్పారు. జ్యూస్ నిల్వచేసిన తర్వాత తీసుకోవద్దని, తాజాగా ఉన్నప్పుడే తాగాలని తెలిపారు. పండ్లు ఆరోగ్యకరమని, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.