'గ్రామాల్లో అభివృద్ధి అంతా కేంద్రం నిధులతోనే'
NZB: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సోమవారం సిరికొండ మండల బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ నిధులతోనే జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయితీలకు ఇస్తున్న నిధుల గురించి గ్రామాల్లోని ప్రజలకు వివరించాలన్నారు.