పులి దాడిలో రెండు మేకలు మృతి

పులి దాడిలో రెండు మేకలు మృతి

KDP: జిల్లా గండికోటలో ఇవాళ పులి సంచారం కలకలం రేపుతుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నాలుగు మేకలపై పులి దాడి చేసినట్లు తెలిపారు. అందులో రెండు మృతి చెందగా మరో రెండింటికి గాయాలు అయినట్లు పేర్కొన్నారు. గతంలోనూ ఒక పులిని పట్టుకున్న అటవీ శాఖ సిబ్బంది చాలా రోజుల తర్వాత మళ్లీ కలవరం రేపుతున్నట్లు తెలియజేశారు. వెంటనే అధికారులు స్పందించి పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.